Google: బెంగళూరు గూగుల్ ఉద్యోగికి కరోనా పాజిటివ్... వెంటనే ఉద్యోగులంతా ఇంటికి!

Corona Positive for Google Employee
  • ఈ ఉదయం పాజిటివ్ అంటూ రిపోర్ట్
  • వర్క్ ఫ్రమ్ హోమ్ ఆదేశాలు జారీ
  • అతనితో కలిసిన వారందరికీ వైద్య పరీక్షలు
బెంగళూరులో ఉన్న గూగుల్ క్యాంపస్ లో ఓ ఉద్యోగికి కరోనా వైరస్ సోకినట్టు ఈ ఉదయం స్పష్టం కావడంతో, ఉద్యోగులంతా వెంటనే ఇంటికి వెళ్లిపోవాలని ఆదేశిస్తూ, వర్క్ ఫ్రమ్ హోమ్ అనుమతులను యాజమాన్యం మంజూరు చేసింది.

 ఈ మేరకు మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసిన గూగుల్, "బెంగళూరులోని మా గూగుల్ శాఖలో విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగికి కోవిడ్-19 వైరస్ పాజిటివ్ అని రిపోర్టు వచ్చింది. దీంతో అతన్ని వెంటనే ఐసోలేషన్ వార్డుకు తరలించాం. ముందు జాగ్రత్త చర్యగా మా ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని కోరాం" అని పేర్కొంది.

ఆ ఉద్యోగితో కలిసి పని చేసిన అందరి ఆరోగ్య పరిస్థితినీ పరిశీలిస్తున్నామని, వారందరినీ మరెవరితోనూ కలవకుండా విడిగా ఉంచామని తెలిపింది. సంస్థలో పనిచేసే వారి ఆరోగ్యం, క్షేమం తమకు అత్యంత ప్రాధాన్యతాంశాలని వెల్లడించింది.
Google
Corona Virus
Bengalore
Work From Home

More Telugu News