Rajinikanth: రజనీకాంత్ తీరే అంత.. మండిపడిన సీపీఐ నేత ముత్తరసన్

CPI leader Muttarasan fires on Rajinikanth
  • ఆయన నిద్రపోడు.. ఇతరులను నిద్రపోనివ్వడు
  • పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు
  • ఆ మాట పార్టీ  ప్రకటన తర్వాత చెప్పి ఉండాల్సింది
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌పై ఆ రాష్ట్ర సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ముత్తరసన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజకీయాలపై నిన్న రజనీ ప్రకటన తర్వాత ముత్తరసన్ విలేకరులతో మాట్లాడుతూ తీవ్ర విమర్శలు చేశారు. కొత్త పార్టీ గురించి కానీ, సిద్ధాంతాల గురించి కానీ రజనీ ఎక్కడా ప్రస్తావించలేదన్నారు.

 తన వెంట సమర్థులైన నాయకులు లేరన్న కారణంతో ఇతర పార్టీల నుంచి వచ్చే వారికి అవకాశం కల్పిస్తానని చెప్పడం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడమే అవుతుందన్నారు. పార్టీకి, ప్రభుత్వానికి వేర్వేరు నేతలన్న రజనీ.. ఆ ప్రకటనేదో పార్టీని ప్రకటించిన తర్వాత చేస్తే బాగుండేదని అన్నారు. రజనీకాంత్ నిద్రపోడని, ఇతరులనూ నిద్రపోనివ్వడని మండిపడ్డారు. బీజేపీ దేశంలో మతకలహాలను ప్రోత్సహిస్తోందని ముత్తరసన్ ఆరోపించారు.
Rajinikanth
Tamil Nadu
muttarasan
Politics

More Telugu News