SBI: యస్ బ్యాంకులో రూ.7250 కోట్ల విలువైన షేర్ల కొనుగోలుకు ఎస్‌బీఐ ఓకే!

  • రూ. 10 విలువైన రూ.725 కోట్ల షేర్లు కొనుగోలు
  • ఎస్‌బీఐ సొంతం కానున్న 49 శాతం షేర్లు
  • బోర్డు సమావేశంలో నిర్ణయం
SBI ready to invest Rs 7250 crores in Yes Bank

సంక్షోభంలో కూరుకుపోయిన యస్ బ్యాంకును ఆదుకునేందుకు భారతీయ స్టేట్‌ బ్యాంకు (ఎస్‌బీఐ) ముందుకొచ్చింది. రూ.7250 కోట్ల విలువ గల షేర్లను యస్‌ బ్యాంకు నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించింది. గురువారం జరిగిన బోర్డు మీటింగులో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎస్‌బీఐ తెలిపింది.

నిజానికి తొలుత రూ.2450 కోట్లు మాత్రమే పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. అయితే, నిన్న జరిగిన సమావేశంలో దీనిని రూ.7250 కోట్లకు పెంచింది. ఇందులో భాగంగా రూ.10 విలువైన 725 కోట్ల షేర్లను కొనుగోలు చేసేందుకు ‘ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫ్ సెంట్రల్ బోర్డు’ అంగీకరించింది. ఫలితంగా యస్ బ్యాంకులో 49 శాతం వాటా ఎస్‌బీఐ సొంతం కానుంది. ‘యస్ బ్యాంకు లిమిటెడ్ రీకన్‌స్ట్రక్షన్ స్కీమ్-2020’ ముసాయిదా ప్రకారం ఈ వాటా ఎస్‌బీఐ సొంతం కానుంది. వచ్చే మూడేళ్లలో 26 శాతం వాటాకు తగ్గకుండా ఈ పెట్టుబడులు కొనసాగించాల్సి ఉంటుంది.

More Telugu News