అనుష్కను రవితేజ, ఛార్మి, నేనూ ‘అమ్మా’ అని పిలుస్తాం: దర్శకుడు పూరీ జగన్నాథ్​

12-03-2020 Thu 21:27
  • అనుష్క సినీ రంగంలోకి ప్రవేశించి పదిహేనేళ్లు 
  • మంచితనం, తెలివితేటలు.. అన్నీ కలిసిన కాంబినేషన్ అనుష్క 
  •  ఆమెను కలిసినప్పుడల్లా ఆమె కాళ్లకు దండం పెడతామన్న పూరీ
Puri Jagnath interesting comments

అందాల రాశి అనుష్క సినీ రంగంలోకి ప్రవేశించి పదిహేనేళ్లు అవుతోంది.  ఈ సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు, నిర్మాతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘అనుష్క చాలా మంచిది’ అని అందరూ చెప్పే మాట నిజమేనని అన్నారు. ఆమె నిజంగా మంచిదేనని, ఆమె దగ్గర చాలా నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయని అన్నారు.

‘రవితేజ, ఛార్మి, నేను.. అనుష్కను ‘అమ్మ’ అని పిలుస్తామని, ఆమెను కలిసినప్పుడల్లా ఆమె కాళ్లకు దండం పెట్టి ‘బ్లెస్సింగ్స్’ తీసుకుంటామని, ఎందుకంటే, ఆమెలో ఉన్న మంచి లక్షణాలలో కొన్నైనా తమకు రావాలని ఆ విధంగా చేస్తామని చెప్పారు. ‘చాలా మంచితనం, చాలా తెలివితేటలు.. అన్నీ కలిసిన ఓ కాంబినేషన్‘ అంటూ అనుష్కను ప్రశంసించారు.