TRS: టీఆర్ఎస్​ నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా కేకే, సురేశ్​ రెడ్డి

KK and Suresh Reddy as Rajya Sabha candidates from TRS
  • కేకే, సురేశ్ రెడ్డి పేర్లు ఖరారు
  • ఈ మేరకు సీఎం కేసీఆర్ నిర్ణయం
  • రేపు ఉదయం నామినేషన్ల దాఖలు
టీఆర్ఎస్ తమ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. పార్టీ సీనియర్ నేతలు కే కేశవరావు (కేకే), మాజీ ఎమ్మెల్సీ సురేశ్ రెడ్డి పేర్లను ఖరారు చేసింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కేకే, సురేశ్ రెడ్డి లు రేపు ఉదయం తమ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. కాగా, టీఆర్ఎస్ పార్లమెంటరీ పక్షనేతగా ఉన్న కేకే మరోసారి అవకాశం దక్కించుకున్నారు. రాజ్యసభ సీటు కోసం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదు.
TRS
Rajyasabha
candidates
K. Keshava Rao
Suresh Reddy

More Telugu News