Corona Virus: కరోనా మహమ్మారిని జయించిన 98 ఏళ్ల శాస్త్రవేత్త

  • ఫిబ్రవరిలో కరోనా బారిన పడిన చైనా శాస్త్రవేత్త
  • ఆయన భార్యకు సోకిన వైరస్
  • 18 రోజుల పాటు వైరస్ తో పోరాటం
Chinese scientist and wife wins corona

కరోనా వైరస్ బీభత్సం ఇప్పట్లో ఆగేట్టు కనిపించడంలేదు. చైనా వెలుపల కూడా భారీగా మరణాలు నమోదవుతున్నాయి. ఇటలీలో  ఒక్కరోజే 196 మంది కరోనాతో మరణించారన్న వార్తలు భీతిగొలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఆశ్చర్యకరంగా చైనాలో ఓ వృద్ధ శాస్త్రవేత్త, ఆయన భార్య కరోనా మహమ్మారి నుంచి కోలుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. హాన్ తియాన్ క్వీ అనే ఆ శాస్త్రవేత్త వయసు 98 సంవత్సరాలు కాగా, ఆయన భార్య వయసు 85 ఏళ్లు. ఇంతటి వృద్ధాప్యంలోనూ వారు కరోనా బారి నుంచి ఆరోగ్యంగా బయటపడడం చర్చనీయాంశంగా మారింది. ఫిబ్రవరి మధ్యలో ఈ దంపతులు కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరారు. 18 రోజుల పాటు కరోనాతో పోరాడిన ఈ జంట దిగ్విజయంగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయింది.

More Telugu News