Amaravati: పేదల ఇళ్ల పట్టాల పంపిణీ జీవోకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్​పై తీర్పు రిజర్వ్​

  • రాజధాని ప్రాంతంలో ఇళ్ల పట్టాల పంపిణీ  జీవో చట్ట విరుద్ధం
  • ఆ ప్రాంతంలో రిజర్వ్ చేసిన 5 శాతం భూముల్లోనే ఇళ్లు నిర్మించాలి
  • పేదలకు నివాస స్థలాలు కేటాయించాలని చట్టంలో  లేదు: పిటిషనర్ తరఫు న్యాయవాది
 Reserve judgment on petition for distribution of title deeds to poor in capital area

ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించిన పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ పిటిషన్ పై తీర్పును రిజర్వ్ లో ఉంచుతున్నట్టు న్యాయస్థానం ప్రకటించింది. రాజధాని ప్రాంతంలో ఇళ్ల పట్టాల పంపిణీకి జీవో జారీ చేయడం చట్టవిరుద్ధమని పిటిషనర్ల తరఫు న్యాయవాది హైకోర్టుకు విన్నవించారు. రాజధాని ప్రాంతంలో ఇళ్లు కోల్పోయిన పేదలకు సీఆర్డీఏ చట్టం ప్రకారం ఆ ప్రాంతంలో రిజర్వ్ చేసిన ఐదు శాతం భూముల్లోనే ఇళ్లు నిర్మించాలని అన్నారు. పేదలకు నివాస స్థలాలు కేటాయించాలని చట్టంలో ఎక్కడా లేదని, కేవలం, నివాసయోగ్యమైన ఇల్లు మాత్రమే ఇవ్వాలని ఉందని న్యాయస్థానం ఎదుట తమ వాదనలు వినిపించారు.

More Telugu News