ipl: స్టేడియాల్లోకి ప్రేక్షకులకు నో ఎంట్రీ.. ఈ సీజన్ ఐపీఎల్‌ కేవలం టీవీలో మాత్రమే!

  • కరోనా నేపథ్యంలో కీలక నిర్ణయం 
  • బీసీసీఐ సీనియర్ అధికారి వెల్లడి
  • శనివారం తుది నిర్ణయం తీసుకోనున్న బోర్డు
No spectators allowed to IPL it could go TV only over coronavirus says Official

దేశంలో రోజు రోజుకు కరోనా వేగంగా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో ఐపీఎల్ పదమూడో సీజన్ నిర్వహణపై అనుమానాలు తలెత్తాయి. మహారాష్ట్రలో ఐపీఎల్‌ టికెట్లను విక్రయించకూడదని ఆ రాష్ట్ర సర్కారు ఆదేశించగా.. కర్ణాటక ప్రభుత్వం కూడా ఈ లీగ్‌ వద్దంటోంది. దేశ, విదేశీ ఆటగాళ్లు, ప్రేక్షకుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

కరోనా నేపథ్యంలో ఈ సీజన్‌ మ్యాచ్‌లకు ప్రేక్షకులను అనుమతించకూడదని భావిస్తున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐకి చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. అయితే, ఐపీఎల్ మాత్రం కచ్చితంగా జరుతుందని స్పష్టం చేశారు. మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం అవుతాయి కాబట్టి.. అభిమానులు టీవీల్లో ఆట చూడొచ్చని తెలిపారు. ఈ లెక్కన ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. దీనిపై ఐపీఎల్‌ గవర్నింగ్ కౌన్సిల్, బీసీసీఐ శనివారం సమావేశమై తుది నిర్ణయం వెల్లడించే చాన్సుంది. కాగా, ఈ నెల 29 నుంచి ఐపీఎల్‌ పదమూడో సీజన్‌ మొదలవనుంది.

More Telugu News