Dharmashala: వాన దెబ్బ.... ఒక్క బంతి పడకుండానే ధర్మశాల వన్డే రద్దు

Dharmashala ODI abandoned without bowl a ball
  • ధర్మశాల వేదికగా టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య తొలి వన్డే
  • ధర్మశాలలో కొన్నిరోజులుగా వర్షాలు
  • చిత్తడిగా మారిన మైదానం
టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య ధర్మశాలలో జరగాల్సిన తొలి వన్డే వర్షం కారణంగా రద్దయింది. కనీసం టాస్ కూడా వేయని పరిస్థితుల్లో ఒక్క బంతి పడకుండానే మ్యాచ్ వర్షార్పణం అయింది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా తొలి వన్డేకు వేదికైన ధర్మశాలలో గత రెండ్రోజులుగా వర్షం కురుస్తోంది. ఇవాళ కూడా వరుణుడు ప్రత్యక్షం కావడంతో మైదానాన్ని మ్యాచ్ కు అనువుగా చేసేందుకు సిబ్బంది ప్రయత్నాలన్నీ వ్యర్థం అయ్యాయి. మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు మ్యాచ్ నిర్వహణ కష్టమేనని తేల్చారు. పదేపదే వర్షం అంతరాయం కలిగిస్తుండడంతో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.
Dharmashala
Team India
South Africa
ODI
Abandoned

More Telugu News