Chammak Chandra: చమ్మక్ చంద్ర సినిమా రిలీజ్ డేట్ ఖరారు

  • హీరోగా చమ్మక్ చంద్ర
  • గ్రామీణ నేపథ్యంలో 'రామసక్కనోళ్లు'
  •  ఈ నెల 20వ తేదీన విడుదల  
Ramasakkanollu Movie

చమ్మక్ చంద్ర కథానాయకుడిగా సతీశ్ కుమార్ నిర్మాణంలో 'రామసక్కనోళ్లు' చిత్రం రూపొందింది. సర్కార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి విడుదల తేదీని ఖరారు చేశారు. ఈ నెల 20వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. కథానాయికగా మేఘన పరిచయమవుతున్న ఈ సినిమాలో, నాగినీడు .. సాయాజీ షిండే .. బ్రహ్మాజీ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.

ఘంటాడి కృష్ణ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. ఇప్పటివరకూ కామెడీ .. డాన్సులు మాత్రమే చేస్తూ వచ్చిన చమ్మక్ చంద్ర, ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ చేయడం విశేషం. చమ్మక్ చంద్ర హీరోగా చేస్తున్న ఈ సినిమా, ఆయన కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి.

More Telugu News