భారత్​, దక్షిణాఫ్రికా మ్యాచ్​కు వర్షం అడ్డంకి.. టాస్​ ఆలస్యం

12-03-2020 Thu 13:48
  • నేడు ఇరు జట్ల మధ్య తొలి వన్డే
  • ధర్మశాల మైదానంలో చిన్నపాటి వర్షం
  • డ్రెస్సింగ్‌ రూమ్స్‌లోనే ఆటగాళ్లు
Rain delays toss in Dharamsala

భారత్, దక్షిణాఫ్రికా మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ధర్మశాలలో నేడు జరిగే మొదటి వన్డేకు వర్షం అడ్డొచ్చింది. చిన్నపాటి వర్షం కారణంగా టాస్ ఆలస్యమవుతోంది. బుధవారం రాత్రి కురిసిన వర్షానికి మైదానం చిత్తడిగా మారడంతో షెడ్యూల్ ప్రకారం ఒంటిగంటకు వేయాల్సిన టాస్‌ వాయిదా వేశారు.

తర్వాత 1.15 గంటలకు అంపైర్లు మైదానాన్ని పరిశీలిస్తామని ప్రకటించారు. కానీ, మళ్లీ వర్షం మొదలైంది. వర్షం రాకముందు మైదానంలో కొద్దిసేపు ప్రాక్టీస్‌ చేసిన ఇరు జట్ల ఆటగాళ్లు ఇప్పుడు డ్రెస్సింగ్‌ రూమ్లకే పరిమితమయ్యారు. టాస్‌ ఆలస్యమయ్యే కొద్దీ ఓవర్లు కుదించే అవకాశం ఉంటుంది. వర్షం తగ్గకపోతే మాత్రం మ్యాచ్‌ రద్దవ్వచ్చు. ప్రస్తుతానికి పిచ్‌తో పాటు మొత్తం మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు.