Sunil: 'నువ్వు నేను' సినిమా షూటింగులో ఉదయ్ కిరణ్ అలా చేశాడు: సునీల్

Nuvvu Nenu Movie
  • 'నువ్వు నేను'లో ఇద్దరం కలిసి నటించాం 
  • ప్రొఫెషనల్ రన్నర్స్ తో ఉదయ్ పోటీపడ్డాడు
  • అతను మంచి మిత్రుడన్న సునీల్
యువ కథానాయకుడిగా యూత్ హృదయాలను గెలుచుకున్న ఉదయ్ కిరణ్, కొన్ని కారణాల వలన ఆ మధ్య ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన మరణం అభిమానులను ఎంతగానో బాధించింది. అలాంటి ఉదయ్ కిరణ్ కి సంబంధించిన ఒక సంఘటనను నటుడు సునీల్ తలచుకున్నాడు.

'నువ్వు నేను' సినిమా కోసం తేజ ఒక రన్నింగ్ సీన్ ను చిత్రీకరించాలనుకున్నారు. ఆ సీన్ కోసం ప్రొఫెషనల్ రన్నర్స్ ను తేజ పిలిపించాడు. వాళ్లతో పోటీపడి ఉదయ్ కిరణ్ పరిగెత్తాలి .. విజేతగా నిలవాలి. అయితే ఆ రన్నర్స్ తో ఉదయ్ కిరణ్ నిజంగానే పోటీపడి పరిగెత్తాడు .. గెలిచాడు. షూటింగులో వున్న మేమంతా ఆశ్చర్యపోయాము. 'అంతలా ఎలా పరిగెత్తావ్ రా' అని అడిగితే, 'సిటీ బస్సులెంట పరిగెత్తిన అనుభవం ఇప్పుడు పనికొచ్చింది' అని కామెడీ చేశాడు. నిజంగానే ఉదయ్ కిరణ్ మంచి నటుడు .. మంచి మిత్రుడు" అని చెప్పుకొచ్చాడు.
Sunil
Uday Kiran
Nuvvu Nenu Movie

More Telugu News