trisha: పెద్దలు చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకోను!: హీరోయిన్ త్రిష

trisha about her marriage
  • ప్రేమించే పెళ్లి చేసుకుంటా
  • కాబోయే భర్త బాగా చూసుకునేవాడై ఉండాలి
  • హీరో కానవసరం లేదు.. అందంగా ఉండాల్సిన పనిలేదు
పెద్దలు చూసిన అబ్బాయిని తాను పెళ్లి చేసుకోనని, ప్రేమించే పెళ్లి చేసుకుంటానని హీరోయిన్ త్రిష చెప్పింది. తాజాగా, ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ...  తాను పెళ్లి చేసుకుంటాను కానీ, తన పెళ్లి విషయంలో కుటుంబ పెద్దలు చెప్పే మాటను వినబోనని తేల్చి చెప్పింది. వారు చూసే వరుడు తనకు వద్దని, ప్రేమ పెళ్లి చేసుకుంటానని తెలిపింది. తనకు కాబోయే భర్త తనను బాగా చూసుకునేవాడై ఉండాలని చెప్పింది.

తనకు కాబోయే భర్త హీరో కానవసరం లేదని త్రిష చెప్పుకొచ్చింది. అలాగే, చాలా అందంగా ఉండాల్సిన పని లేదని తెలిపింది. మంచి వాడై ఉండాలని, తనను బాగా అర్థం చేసుకోవాలని చెప్పింది. అలాంటి వ్యక్తి తనకు పరిచయమైతే పెళ్లాడతానని తెలిపింది. ప్రస్తుతం త్రిష పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఆమె ప్రేమలో పడిందని గతంలో చాలా వార్తలు వచ్చాయి.
trisha
Tollywood

More Telugu News