Bihar: కరోనా అనుమానంతో ఆసుపత్రికి... ఐసోలేషన్ వార్డు అనగానే పరుగో పరుగు!

corono virus effected man missing in bihar
  • ఆసుపత్రి నుంచి మాయమైన అనుమానితుడు 
  • బీహార్‌లోని నౌరంగా పట్టణంలో ఘటన 
  • ఢిల్లీలో పనిచేస్తున్న గౌతం కుమార్

ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తి దగ్గు, జ్వరంతో బాధపడుతున్నాడని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తెచ్చారు. పరీక్షించిన వైద్యులు కరోనా వైరస్ సోకిందేమో అన్న అనుమానంతో ఐసోలేషన్ వార్డులో ఉంచాల్సి ఉందని సూచించారు. అంతే...కాసేపటికి సదరు బాధితుడు ఆసుపత్రి నుంచి అదృశ్యమయ్యాడు. 

వివరాల్లోకి వెళితే...బీహార్ రాష్ట్రం నలంద జిల్లా నౌరంగా పట్టణానికి చెందిన గౌతంకుమార్ ఢిల్లీలో పనిచేస్తున్నాడు. దగ్గు, గొంతునొప్పి, జ్వరం వంటి కరోనా వైరస్ లక్షణాలతో ఈనెల 4వ తేదీన బీహార్ రాష్ట్రంలోని స్వంత ప్రాంతం నౌరంగా పట్టణానికి వచ్చాడు. గౌతం పరిస్థితి చూసి అనుమానంతో కుటుంబ సభ్యులు సదర్లోని ఆసుపత్రికి తీసుకువెళ్లారు.

 అతన్ని పరీక్షించి వైద్యులు ఐసోలేషన్ వార్డులో ఉంచాల్సిన అవసరం ఉందని, అందుకు సిద్ధం కావాలని సూచించారు. అంతే.. కాసేపటిలో వస్తానని చెప్పి బయటకు వెళ్లిన గౌతం తర్వాత కనిపించకుండా మాయమైపోయాడు. కరోనా వైరస్ లక్షణాలున్న రోగి అదృశ్యం కావడంతో వైద్యులు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

  • Loading...

More Telugu News