Kurnool District: ఇప్పుడు కర్నూలులో.. 65 ఏళ్ల వృద్ధురాలిలో కరోనా వైరస్ లక్షణాలు

Woman Who came from Jordan found Corona virus symptoms
  • ఇటీవల జోర్డాన్ వెళ్లొచ్చిన మహిళ
  • ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స
  • పూణెకు రక్త నమూనాలు
కరోనా వైరస్ ఇప్పుడు కర్నూలు జిల్లాలో కలకలం రేపుతోంది. జిల్లాలో ఓ అనుమానిత కేసు నమోదు కావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఆమె నివసిస్తున్న ప్రాంతం వాసులైతే వణికిపోతున్నారు. పట్టణానికి చెందిన 65 ఏళ్ల మహిళ ఇటీవల జోర్డాన్ వెళ్లి వచ్చింది. తాజాగా, ఆమెలో వైరస్ లక్షణాలు కనిపించడంతో అప్రమత్తమైన వైద్యాధికారులు పట్టణంలోని సర్వజన వైద్యశాలకు తరలించి ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆమె నుంచి రక్త నమూనాలు సేకరించి పరీక్షల కోసం పూణె పంపించారు. రిపోర్టులు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు.
Kurnool District
Corona Virus
Andhra Pradesh
Jordan

More Telugu News