Flight: తుమ్మిన ప్రయాణికుడు... విమానం ఎమర్జెన్సీ లాండింగ్!

Flight Emergency Landing over Corona Alert
  • అమెరికాలో ఘటన
  • సాటి ప్రయాణికుడి తుమ్ములను చూసి గాబరా
  • డెన్వర్ లో ల్యాండ్ అయిన విమానం
ఒకసారి టేకాఫ్ అయిన తరువాత, విమానాలు వెనక్కు వచ్చేయడం లేదా గమ్యస్థానానికి కాకుండా ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం మరో ఎయిర్ పోర్టును సంప్రదించడం వంటి వార్తలు చాలానే వినుంటాం. కానీ, విమానంలో ఓ ప్రయాణికుడికి తుమ్ములు రావడంతో ఆ విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. కరోనా వైరస్ ప్రపంచాన్ని తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్న వేళ, ఈ ఘటన అమెరికాలో జరిగింది.

కొలరాడో రాష్ట్రంలోని ఈగిల్ ఎయిర్ పోర్టు నుంచి న్యూజెర్సీకి ఓ విమానం బయలుదేరగా, ఓ ప్రయాణికుడికి తుమ్ములు వచ్చాయి. అదే ప్రయాణికుడు దగ్గుతూ కూడా ఉండటంతో మిగతా ప్రయాణికులు గాబరా పడిపోయారు. దీంతో పైలట్ తనకు సమీపంలో ఉన్న డెన్వర్ ఎయిర్ పోర్టు అధికారులకు సమాచారాన్ని అందించాడు. ఫ్లయిట్ ను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసేందుకు అనుమతి కోరడంతో వారు అంగీకరించారు.

దీంతో పైలట్ డెన్వర్ ఎయిర్ పోర్టులో విమానాన్ని దించగా, అప్పటికే సమాచారాన్ని అందుకున్న వైద్యులు అతన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ ప్రయాణికుడికి వచ్చింది అలర్జీయేనని తేల్చారు. ఏ విధమైన కొవిడ్-19 లక్షణాలు లేవని వారు చెప్పడంతో విమానం తిరిగి న్యూజెర్సీకి బయలుదేరింది.
Flight
Emergency Landing
Corona Virus

More Telugu News