India: రేపు దక్షిణాఫ్రికాతో టీమిండియా తొలి వన్డేకి వాన గండం!

Rain scare for Team India first ODI against South Africa
  • సఫారీలతో సొంతగడ్డపై మూడు వన్డేలు ఆడనున్న టీమిండియా
  • గురువారం ధర్మశాలలో తొలి వన్డే
  • గతరాత్రి నుంచి ధర్మశాలలో ఎడతెరిపిలేని వాన
  • మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచిన సిబ్బంది
ఐపీఎల్ ప్రారంభానికి ముందు టీమిండియా సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో మూడు వన్డేలు ఆడనుంది. ఈ క్రమంలో తొలి వన్డే రేపు ధర్మశాల వేదికగా జరగనుంది. అయితే ధర్మశాలలో గతరాత్రి నుంచి జోరుగా వర్షం కురుస్తోంది. మైదానం చిత్తడిగా మారడంతో మ్యాచ్ నిర్వహణ అనుమానంగా మారింది. ఇవాళ కూడా వర్షం కురవడంతో మైదానాన్ని మ్యాచ్ కు అనువుగా సిద్ధం చేసే పనులకు ఆటంకం కలిగింది. రోజులో అత్యధిక భాగం మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. గురువారం కూడా ధర్మశాలలో వర్షం పడే అవకాశాలున్నాయని వాతావరణ నివేదికలు చెబుతున్నాయి.
India
South Africa
ODI
Dharmashala
Rain

More Telugu News