Bonda Uma: బోండా ఉమ, బుద్ధా వెంకన్నలపై దాడి చేసింది ఇతనే.. జగన్ తో కలిసి ఉన్న ఫొటోలను విడుదల చేసిన టీడీపీ

TDP releases photos of the attacker who dares on Bonda Uma and Budda Venkanna car
  • మాచర్లలో టీడీపీ నేతలపై దాడి
  • బుద్ధా వెంకన్న, బోండా ఉమ వాహనంపై దాడికి పాల్పడిన వైసీపీ కార్యకర్త
  • ఘటనపై తీవ్రంగా స్పందించిన టీడీపీ
  • దాడికి పాల్పడిన వ్యక్తి ఫొటోలు ట్విట్టర్ లో వెల్లడి
టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమలపై గుంటూరు జిల్లా మాచర్లలో దాడి జరగడంపై పార్టీ వర్గాలు ఘాటుగా స్పందిస్తున్నాయి. ఇప్పటికే చంద్రబాబు, లోకేశ్, దేవినేని ఉమ తదితర సీనియర్ నేతలు ఘటనను తీవ్రస్థాయిలో ఖండించారు. తాజాగా, ఈ దాడికి పాల్పడిన వైసీపీ కార్యకర్త ఫొటోలను టీడీపీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

టీడీపీ నేతలపై దాడి చేసిన వ్యక్తి ఆ ఫొటోల్లో సీఎం జగన్, మంత్రులు అనిల్, మేకతోటి సుచరిత, కొడాలి నాని తదితరులతో సన్నిహితంగా ఉన్న దృశ్యాలు చూడొచ్చు. పాదయాత్ర సమయంలోనూ ఆ వ్యక్తి జగన్ వెంటే చిరునవ్వులు చిందిస్తూ కనిపించాడు. దీనిపై ట్విట్టర్ లో స్పందించిన టీడీపీ... మాచర్లలో బుద్ధా వెంకన్న, బోండా ఉమలపై ఈ వైసీపీ గూండానే దాడి చేశాడని వెల్లడించింది. ఉమ, వెంకన్నలపై హత్యాయత్నం చేశాడని ఆరోపించింది.
Bonda Uma
Budda Venkanna
Macherla
Attack
YSRCP
Telugudesam
Local Body Polls

More Telugu News