Adireddy Bhavani: సీఎం జగన్​ ప్రోద్బ‌లంతోనే బుద్ధా వెంక‌న్న‌పై దాడి జ‌రిగింది: ఆదిరెడ్డి భవానీ ఆరోపణ

TDP Leader Adireddy Bhavani severe allegations on Jagan
  • ‘సేవ్ ఏపీ ఫ్రమ్ జగన్’, ‘జగన్ రౌడీ రాజ్యం’ ట్యాగ్స్ తో పోస్ట్
  • డీఎస్పీని, న్యాయవాదిని వైసీపీ కిరాయిమూకలు చావగొట్టాయి
  • ఏపీ ప్రజాస్వామ్యాన్ని జగన్ ఖూనీ చేశారు
మాచర్లలో టీడీపీ నాయకుల వాహనంపై దాడి ఘటనపై ఆ పార్టీ నేత ఆదిరెడ్డి భవానీ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ పై ఆమె తీవ్ర విమర్శలు చేశారు. ‘సేవ్ ఏపీ ఫ్రమ్ జగన్’, ‘సేవ్ ఏపీ ఫ్రమ్ వైసీపీ గూన్స్’, ‘జగన్ రౌడీ రాజ్యం’ ట్యాగ్స్ తో జగన్ పై ఆమె విరుచుకుపడ్డారు. వైసీపీ అక్ర‌మాలను నిల‌దీస్తున్న బీసీ నేత ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న‌పై సీఎం ప్రోద్బ‌లంతోనే దాడి జ‌రిగిందని ఆరోపించారు. ఈ ఘటనను అడ్డుకునేందుకు యత్నించిన డీఎస్పీని, న్యాయవాదిని వైసీపీ కిరాయిమూకలు చావగొట్టాయని మండిపడ్డారు.
Adireddy Bhavani
Telugudesam
Jagan
YSRCP
Macherla

More Telugu News