వైసీపీ అభద్రతా భావం అర్ధమవుతోంది: కన్నా లక్ష్మీ నారాయణ

11-03-2020 Wed 14:52
  • ‘స్థానిక’ ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు భయమెందుకు?
  • మిగిలిన పార్టీల అభ్యర్థులకు సర్టిఫికెట్ల జారీలో నిర్లక్ష్యం తగదు
  • అభ్యర్థులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు
Kanna Lakshmi Narayana severe comments on YSRCP

మాచర్ల ఘటన నేపథ్యంలో వైసీపీపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ మేరకు కన్నా వరుస ట్వీట్లు చేశారు.  స్థానిక సంస్థల ఎన్నికలు నిష్పక్షపాతంగా జరపడానికి వైసీపీ ఎందుకు భయపడుతోంది? అని ప్రశ్నించారు. పోటీ చేసే అభ్యర్థులపై దాడులు చేయడం, వైసీపీకి తప్ప మిగిలిన పార్టీల అభ్యర్థులకు సర్టిఫికెట్లు జారీ చేయడంలో నిర్లక్ష్యం చేయడం, వారిపై కేసులు బనాయిస్తూ భయబ్రాంతులకు గురిచేయడం తగదని, గ్రామ వాలంటీర్ల వ్యవస్థను దుర్వినియోగం చేయడం చూస్తుంటే వైసీపీ అభద్రతా భావం అర్ధమవుతోందని అన్నారు.