GVL Narasimha Rao: వైసీపీ దాడులపై ఈసీ తక్షణమే జోక్యం చేసుకోవాలి: జీవీఎల్ డిమాండ్

GVL says that he condemns YSRCP attacks on BJP cadre
  • స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ఘట్టం హింసాత్మకం
  • విపక్షాల అభ్యర్థులపై దాడులు
  • తీవ్రంగా ఖండించిన జీవీఎల్
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల పర్వం హింసాత్మక రూపుదాల్చింది. అనేక చోట్ల విపక్షాల అభ్యర్థులపై దాడులు జరిగినట్టు వీడియోలు కూడా వచ్చాయి. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలో బీజేపీ అభ్యర్థులపై దాడి జరిగింది. దీనిపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పందించారు. ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాల్లో బీజేపీ కార్యకర్తలపై వైసీపీ నేతలు, కార్యకర్తలు దాడులకు పాల్పడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ట్వీట్ చేశారు. ఈ రాజకీయ హింసను అరికట్టేందుకు తక్షణమే రాష్ట్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని జీవీఎల్ డిమాండ్ చేశారు.
GVL Narasimha Rao
Local Body Polls
BJP
YSRCP
Nominations
Andhra Pradesh

More Telugu News