Chandrababu: మాచర్లలో దాడి ఘటనపై డీజీపీ సమాధానం చెప్పాలి: చంద్రబాబు డిమాండ్​

Chandrababu demands AP DGP must answer about Macherla incident
  • ఎస్పీకి ముందుగానే చెప్పినా ఇలా జరిగిందంటే ఏమనాలి?
  • రక్తపు మరకలు చూసి కూడా డీజీపీకి బాధ కలగట్లేదా? 
  • రాష్ట్రంలో ఇంత దౌర్భాగ్య పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు
గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ నాయకుల వాహనంపై దాడి ఘటనపై ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ సమాధానం చెప్పాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. ఎస్పీకి ముందుగానే చెప్పినా ఇలా జరిగిందంటే ఏమనాలి? రక్తపు మరకలు చూసి కూడా డీజీపీకి బాధ కలగట్లేదా? అని ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా డీజీపీకి చీమకుట్టినట్టుగా కూడా లేదని మండిపడ్డారు.

రాష్ట్రంలో ఇంత దౌర్భాగ్య పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని, పులివెందుల రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. రాష్ట్రంలో అరాచకాలను చూస్తూ ఊరుకుంటారా? కశ్మీర్, బీహార్ లో కూడా ఇలాంటి ఘటనలు జరగలేదని విమర్శించారు. నియంతపాలనను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని, వైసీపీకి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.
Chandrababu
Telugudesam
Andhra Pradesh
DGP
Gowtham sawangh

More Telugu News