'వి' మూవీని భయపెడుతున్న కరోనా వైరస్?

11-03-2020 Wed 13:17
  • ఇంద్రగంటి నుంచి విభిన్న కథా చిత్రంగా 'వి'
  • ముందుగా చెప్పిన విడుదల తేదీ మార్చి25
  • వాయిదా పడే అవకాశం
V Movie
నాని - సుధీర్ బాబు ప్రధాన పాత్రధారులుగా 'వి' సినిమా రూపొందింది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నిర్మితమైన ఈ సినిమాలో, నివేదా థామస్ - అదితీరావు కథానాయికలుగా కనిపించనున్నారు. ఉగాది పండుగ సందర్భంగా ఈ నెల 25వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.

అయితే ప్రపంచ దేశాలను ఇప్పుడు కరోనా వైరస్ భయపెడుతోంది. ఈ కారణంగా వివిధ భాషల్లోని సినిమాల షూటింగులు .. విడుదల తేదీలు వాయిదా పడుతున్నాయి. కేరళలో సినిమా థియేటర్లను పూర్తిస్థాయిలో మూసేశారు. దాంతో టాలీవుడ్ పెద్దలు ఇప్పుడు ఆలోచనాలో పడ్డారు. యూఎస్ లోను .. తెలుగు రాష్ట్రాల్లోను కరోనా వైరస్ ను గురించిన వార్తలు వినిపిస్తున్నాయి. మరో వైపున ఇది పరీక్షల సీజన్ అయింది. అందువలన 'వి' సినిమా విడుదల తేదీని వాయిదా వేసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ విషయంలో 'దిల్' రాజు ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి మరి.