gurukulam: గురుకుల పాఠశాలల్లో ఖాళీల భర్తీకి చర్యలు: తెలంగాణ అసెంబ్లీలో మంత్రి కొప్పుల

gurukula school vecancies to be filled says minister koppula
  • రాష్ట్రంలో మొత్తం 967 పాఠశాలలు
  • ప్రైవేటు పాఠశాలలకు దీటుగా నడుపుతున్నాం
  • ఖాళీల భర్తీతో మరింత పటిష్టం
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 967 గురుకుల పాఠశాలలు ఉన్నాయని, ఆయా పాఠశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలన్నీ కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా పనిచేస్తున్నాయని, పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు యూనివర్సిటీతోపాటు జాతీయ స్థాయి పరీక్షల్లో సత్తా చాటుతున్న విషయాన్ని గుర్తు చేశారు. ఖాళీల భర్తీతో బోధనా ప్రమాణాలు మరింత పటిష్టమవుతాయని తెలిపారు. ఖాళీలపై వివరాలను త్వరలో తెప్పించుకుని భర్తీకి అవసరమైన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.
gurukulam
vacencies
Koppula Eshwar
telangna assembly

More Telugu News