Corona Virus: దేశంలో 62కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు

coronavirus cases in india
  • మహారాష్ట్రలోని పూణెలో ఐదుగురికి కరోనా
  • జైపూర్‌లో 85 ఏళ్ల వృద్ధుడికి కరోనా నిర్ధారణ
  • జాగ్రత్తలు తీసుకుంటున్న రాష్ట్రాలు
దేశంలో కరోనా వైరస్‌ సోకిన వారి సంఖ్య మరింత పెరిగిపోయింది. మహారాష్ట్రలోని పూణెలో మొత్తం ఐదుగురికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ ప్రకటించారు. వారిని ఐసోలేషన్‌ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. పాఠశాలలకు సెలవులు ఇచ్చే అంశంపై ఈ రోజు మధ్యాహ్నం ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే అధికారులతో చర్చలు జరిపి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.  

అలాగే, రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో 85 ఏళ్ల వృద్ధుడికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 62కి చేరింది. కేరళ, కర్ణాటకతో పాటు కరోనా వైరస్‌ కేసులు నమోదైన రాష్ట్రాలు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. 
Corona Virus
Maharashtra
Rajasthan

More Telugu News