Oil prices: పెట్రోల్‌పై రూ.2.69...డీజిల్‌పై రూ.2.33: భారీగా తగ్గిన ధరలు!

  • అంతర్జాతీయ మార్కెట్‌ ఎఫెక్ట్‌
  • సౌదీ, రష్యాల మధ్య వివాదం
  • దేశీయ మార్కెట్‌లోనూ దిగివస్తున్న పెట్రో ధరలు
Oil prices decreased in indian market

పెరగడమే తప్ప ఎప్పుడోగాని తగ్గని పెట్రో ధరలు హఠాత్తుగా భారీగా తగ్గడం వినియోగదారులను ఆశ్చర్యపరుస్తోంది. దేశీయంగా పెట్రోల్‌ ధర 2 రూపాయల 69 పైసలు, డీజిల్‌ ధర 2 రూపాయల 33 పైసలు తగ్గింది. దీంతో ప్రస్తుతం ముంబయి మార్కెట్లో పెట్రోలు లీటరు రూ.70.29కు, డీజిల్‌ ధర రూ.63.01కు తగ్గింది.

ఒపెక్‌ దేశాల్లో సభ్యులైన సౌదీ అరేబియా, రష్యా మధ్య వివాదంతో అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు భారీగా పతనం కావడంతో ఆ ప్రభావం దేశీయ మార్కెట్‌పైనా కనిపిస్తోంది. మొన్న ఒక్కరోజే బ్యారెల్‌ ధర 35 డాలర్లకు పడిపోయిన విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా క్రూడ్‌ ఉత్పత్తుల్లో సౌదీ అరేబియాది మొదటి స్థానమైతే, రష్యాది రెండో స్థానం. ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య ఆయిల్ ఉత్పత్తి విషయంలో వివాదం నడుస్తోంది.

More Telugu News