Hyderabad: రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో ట్రాన్స్ జెండర్‌ల హల్ చల్.. ఎదురుతిరిగిన స్థానికులు!

midnight nuesence by transgenders
  • మితిమీరిన ఆగడాలపై స్థానికుల ఆగ్రహం 
  • యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శలు 
  • పోలీసులు వారికి చెక్ చెప్పాలని వేడుకోలు

ఇటీవల కాలంలో హైదరాబాద్ లోని పలుచోట్ల రాత్రిపూట ట్రాన్స్ జెండర్ (హిజ్రాలు) లు హల్ చల్ చేస్తూ ఇబ్బందులు కలుగజేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో వీరు తిరుగుతూ రాత్రిపూట న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. 

నిన్న అర్ధరాత్రి రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని ఉప్పరపల్లి వద్ద వీరి ఆగడాలను తట్టుకోలేని స్థానికులు ఎదురు తిరిగారు. దీంతో స్థానికులు, హిజ్రాలకు మధ్య పెద్ద పెట్టున వాగ్వాదం జరిగి ఇరువర్గాలు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లారు. పోలీసుల సమక్షంలో పంచాయతీ జరగడంతో మరోసారి అటువైపు రాబోమని ట్రాన్స్ జెండర్లు లిఖిత పూర్వకంగా రాసివ్వడంతో స్థానికులు శాంతించారు.

గగన్ పహాడ్ వద్ద జాతీయ రహదారిపై కూడా ఇదే పరిస్థితి నెలకొంది. యువకులను మోసగించి డబ్బులు వసూలు చేయడం, అల్లరి చేయడంతో నిత్యం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని స్థానికులు ఈ సందర్భంగా పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. వీరి ఆగడాలకు చెక్ చెప్పాలని కోరారు.

Hyderabad
rajendranagar circle
transgenders
Police

More Telugu News