Chinthamaneni Prabhakar: చింతమనేనితో పాటు మరో 1160 మందిపై బైండోవర్ కేసులు నమోదు

Bindover case on Chinthamaneni Prabhakar
  • స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లాలో బైండోవర్ కేసులు
  • 310 లైసెన్సుడు తుపాకీలు స్వాధీనం
  • ఏలూరు త్రీటౌన్ పీఎస్ లో చింతమనేనిపై రౌడీ షీట్
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లాలో భారీ సంఖ్యలో బైండోవర్ కేసులు నమోదయ్యాయి. టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తో పాటు మరో 1160 మందిపై బైండోవర్ కేసులను పోలీసులు నమోదు చేశారు. జిల్లాలో మొత్తం 445 లైసెన్స్ ఉన్న తుపాకీలు ఉండగా వాటిలో 310 తుపాకీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బైండోవర్ కేసులు నమోదైన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. చింతమనేనిపై ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్ లో రౌడీ షీట్ ఉండటంతో ఆయనను మండల మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో, ఆరు నెలల పాటు అల్లర్లకు పాల్పడకుండా సత్ప్రవర్తనతో ఉండాలని మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు.
Chinthamaneni Prabhakar
Telugudesam
Bindover Case
West Godavari District
Eluru

More Telugu News