Bandla Ganesh: 'నందమూరి' ఫోర్త్ జనరేషన్ సిద్ధం... యంగ్ టైగర్ కు శుభాకాంక్షలు: బండ్ల గణేశ్

Bandla Ganesh Comments on NTR Pic
  • హోలీ సంబరాలను పోస్ట్ చేసిన ఎన్టీఆర్
  • చిత్రంలో ఇద్దరు కుమారులతో దంపతులు
  • నాలుగో తరం వచ్చేసిందన్న బండ్ల గణేశ్
నందమూరి వంశంలో తొలుత ఎన్టీ రామారావు, ఆయన కుమారులుగా హరికృష్ణ, బాలకృష్ణ తెలుగు సినీ ప్రేక్షకులను ఎంతగా మెప్పించారో పెద్దగా చెప్పనక్కరలేదు. హరికృష్ణ కుమారులుగా జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు ఇప్పటికే తమ నట వారసత్వాన్ని అందిపుచ్చుకోగా, బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం త్వరలో జరుగనుంది.

ఈ నేపథ్యంలో నిన్న హోలీ పండగ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్, తన భార్య ప్రణతి, ఇద్దరు కుమారులతో కలిసి దిగిన ఓ ఫొటోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఇది నిమిషాల్లోనే వైరల్ అయింది. దీనిపై స్పందించిన నిర్మాత, నటుడు బండ్ల గణేశ్, "నందమూరి నాలుగో తరానికి డోకా లేదని హోలీ సందర్భంగా తెలియజేసిన మా యంగ్ టైగర్ కి శుభాకాంక్షలు" అని వ్యాఖ్యానించారు. బండ్ల గణేశ్ చేసిన ట్వీట్ పై ఇప్పుడు తెగ కామెంట్లు వస్తున్నాయి.
Bandla Ganesh
Twitter
Junior NTR
Lakshmi Pranathi

More Telugu News