టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులుగా కేకే, పొంగులేటి.. ఖరారు చేసిన కేసీఆర్!
- మండలికి మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి, దేశపతి శ్రీనివాస్
- నిజామాబాద్ మాజీ ఎంపీ కవితకూ దక్కని అవకాశం
- నేడు పేర్లను ప్రకటించే అవకాశం
అయితే, తమ పేర్లను ఖరారు చేసినట్టు తమకు ఇంత వరకు సమాచారం లేదని కేకే, పొంగులేటి గతరాత్రి తెలిపారు. ఈ నెల 13 వరకు నామినేషన్లకు గడువు ఉండడంతో నేడు వీరి పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. అలాగే, శాసనమండలిలో నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా అభ్యర్థిగా మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి, గవర్నర్ కోటా అభ్యర్థిగా సీఎం కార్యాలయ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ పేర్లను కూడా కేసీఆర్ ఫైనల్ చేసినట్టు చెబుతున్నారు. మండలి నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా స్థానానికి నామినేషన్ల స్వీకరణ నేటి నుంచి ప్రారంభం కానుంది.