Devineni Uma: రాజ్యసభ సీటును రూ.200 కోట్లకు బయటి రాష్ట్రం వ్యక్తికి కేటాయించారు: జగన్ పై దేవినేని ఉమ ఆరోపణలు

Devinenei Uma severe allegations on CM Jagan
  • నాడు  వైఎస్ మృతికి ‘రిలయన్స్‘ని అనుమానించారు
  • ఇప్పుడు ముఖేశ్ అంబానీతో కలిసి వచ్చిన వ్యక్తికే సీటు ఇచ్చారు
  • రాజధాని గ్రామాల్లో ‘స్థానిక’ ఎన్నికలు ఎందుకు  వాయిదా వేశారు?
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత దేవినేని ఉమ తీవ్ర ఆరోపణలు చేశారు. ఏపీ నుంచి వైసీపీ తరఫున రాజ్యసభ సీటును పరిమళ్ నత్వానీకి కేటాయించడంపై ఆయన పరోక్ష ఆరోపణలు చేశారు. ముఖేశ్ అంబానీతో కలిసి వచ్చిన బయటి రాష్ట్రం వ్యక్తికి రాజ్యసభ సీటును రూ.200 కోట్లకు కేటాయించారని ఆరోపించారు.

తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానికి కారణం అని ‘రిలయన్స్’పై అనుమానపడ్డారని, ఇప్పుడు ఆ సంస్థ కోరిన వ్యక్తికే రాజ్యసభ టికెట్ ఇచ్చారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా జగన్ పాలనపైనా ఆయన విమర్శలు గుప్పించారు. జగన్ నవమాసాల పాలనలో నవమోసాలు చేశారని మండిపడ్డారు. రాజధాని గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయడం గురించి ప్రస్తావిస్తూ.. వైసీపీ ప్రభుత్వం భయపడుతోందని చెప్పడానికి ఇదే నిదర్శనమని అన్నారు.
Devineni Uma
Telugudesam
Jagan
YSRCP
Andhra Pradesh
cm

More Telugu News