TTD: అనారోగ్యంతో ఉన్నవాళ్లు తిరుమల యాత్ర వాయిదా వేసుకోవాలి: టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి

  • కరోనా దృష్ట్యా భక్తులు దర్శనం టికెట్లు రద్దు చేసుకోవచ్చన్న ఈవో
  • తిరుమలలో రసాయనాలతో నిత్యం శుభ్రపరిచేలా చర్యలు
  • భక్తుల స్క్రీనింగ్ కోసం థర్మల్ గన్స్ వినియోగం
TTD says deceased pilgrims should cancel Tirumala visit

టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి రానున్న వేసవి దృష్ట్యా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా కారణంగా భక్తులు దర్శనం టికెట్లు రద్దు చేసుకునే వెసులుబాటు కల్పించామని చెప్పారు. అనారోగ్యంతో ఉన్నవాళ్లు తిరుమల యాత్ర వాయిదా వేసుకోవాలని సూచించారు.

తిరుమలలో కొన్నిచోట్ల నిత్యం రసాయనాలతో శుభ్రపరిచేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. భక్తులకు స్క్రీనింగ్ నిర్వహించేందుకు థర్మల్ గన్స్ వినియోగానికి చర్యలు తీసుకుంటామని ధర్మారెడ్డి వెల్లడించారు. మే, జూన్ నెలల్లో అడ్వాన్స్ బుకింగ్ కోటా 50 శాతానికి తగ్గిస్తున్నట్టు తెలిపారు. కరెంట్ బుకింగ్ కింద ఎక్కువ గదులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. వేసవిలో శేషాచల కొండలపై కార్చిచ్చు నివారణకు చర్యలు చేపట్టామని అన్నారు.

More Telugu News