Corona Virus: కరోనా ఎఫెక్ట్... ఈ నెలాఖరు వరకు కేరళలో సినిమా హాళ్ల మూసివేత

Kerala decides to shut down cinema halls due to corona scares
  • కేరళలో పెరుగుతున్న కరోనా కేసులు
  • మార్చి 31 వరకు సినిమా థియేటర్లు మూసివేయాలన్న ప్రభుత్వం
  • పెళ్లిళ్లు మినహా ఇతర శుభకార్యాలు వాయిదా వేసుకోవాలని సూచన
సినిమా హాళ్లు కరోనా వ్యాప్తికి కారణమవుతాయన్న ఉద్దేశంతో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనాలు ఎక్కువగా గుమికూడే ప్రదేశాలపై దృష్టిసారించిన కేరళ సర్కారు ఈ నెలాఖరు వరకు సినిమా హాళ్లు మూసివేయాలని నిర్ణయించింది. కేరళ వ్యాప్తంగా ఉన్న అన్ని సినిమా హాళ్లకు మార్చి 31 వరకు ఈ నిర్ణయం వర్తిస్తుందని పేర్కొన్నారు.

అంతేకాదు, వివాహాలు మినహా ఇతర కార్యాలను వాయిదా వేసుకోవాలని సూచించారు. పెళ్లిళ్లకు కూడా అతి దగ్గరి బంధువులు మాత్రమే హాజరయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. సీఎం పి.విజయన్ అధ్యక్షతన కేరళలో ఇవాళ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. కేరళలో కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది.
Corona Virus
Kerala
Cinema Halls
Theatres
P.Vijayan

More Telugu News