Chandrababu: ఎవడబ్బ సొమ్మని ఖర్చు చేశారు... ఈ వైసీపీ నాయకులు కడతారా?: చంద్రబాబు

Chandrababu fires on YSRCP government coloring all facilities
  • రూ.3000 కోట్లు రంగుల కోసం ఖర్చు చేశారన్న చంద్రబాబు
  • ఆ డబ్బు ఎవరు చెల్లించాలంటూ ఆగ్రహం
  • ఇంత విచ్చలవిడితనం ఎప్పుడూ చూడలేదంటూ వ్యాఖ్యలు
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ కార్యాలయాలకు, ఇతర నిర్మాణాలకు పార్టీ జెండా రంగులు వేయడం, ఆ రంగులు తొలగించాలని కోర్టు తీర్పు ఇవ్వడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు.

మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన దీనిపై మాట్లాడుతూ, రంగులు వేయడానికి, మళ్లీ తొలగించడానికి దాదాపు రూ.3000 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని, ఎవడబ్బ సొమ్ము అని ఖర్చు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ డబ్బు వైసీపీ నాయకులు కడతారా? అని ప్రశ్నించారు.

 "చరిత్రలో ఎక్కడైనా ఉందా ఇలా రంగులేయడం? ఇలా ఏ ప్రభుత్వమన్నా చేసిందా? ఉన్మాదం కాకపోతే మరేంటి? ఇంత విచ్చలవిడిగా చేయడం నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఆఖరికి బాత్రూములు, జాతీయ జెండాలకు కూడా పార్టీ రంగులు వేశారు" అంటూ విమర్శించారు.
Chandrababu
YSRCP
Colours
Andhra Pradesh

More Telugu News