Cancel IPL: ఐపీఎల్​ రద్దు చేయండి.. కేంద్రానికి కర్ణాటక సర్కారు లేఖ?

  • ఆతిథ్యం ఇవ్వలేమని తేల్చిచెప్పినట్టు మీడియాలో కథనం
  • నగరంలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌‌కు కరోనా సోకినట్టు నిర్ధారణ
  • ఐటీ జోన్‌లోని పాఠశాలలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
Cancel IPL 2020 Karnataka Government writes a letter to central government

దేశంలో కరోనా వైరస్ రోజు రోజుకూ విజృంభిస్తున్నప్పటికీ ఐపీఎల్ నిర్వహించి తీరుతామని బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ స్పష్టం చేసినా.. ఆ పరిస్థితి కనిపించడం లేదు. రాయల్ చాలెంజర్స్‌ బెంగళూరు టీమ్‌ హోమ్‌గ్రౌండ్‌ అయిన బెంగళూరులో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు కర్ణాటక ప్రభుత్వం ససేమిరా అంటున్నట్టు సమాచారం. లీగ్‌ను వాయిదా వేయాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినట్టు తెలుస్తోంది.

బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి కరోనా సోకిందని ఇటీవలే గుర్తించారు. అమెరికా నుంచి వచ్చిన ఆ వ్యక్తి దాదాపు 2,666 మందిని తాకినట్టు తెలిసింది. ప్రస్తుతం అతను ఐసోలేషన్ వార్డులో చికిత్స తీసుకుంటున్నాడు. దాంతో, బెంగళూరులోని సాఫ్ట్‌వేర్‌‌ సంస్థలు ఉన్న ప్రదేశాల్లోని ప్రాథమిక పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో బెంగళూరులో ఐపీఎల్ మ్యాచ్‌లకు తాము ఆతిథ్యం ఇవ్వలేమని కేంద్రానికి రాష్ట్ర సర్కారు స్పష్టం చేసిందని బెంగళూరులోని దిగ్విజన్ 24/7 అనే టీవీ చానల్ కథనం ప్రసారం చేసింది. దాంతో, బెంగళూరులోనే కాకుండా దేశవ్యాప్తంగా ఐపీఎల్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.

More Telugu News