Paruchuri Gopala Krishna: కిన్నెర మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వాలి: పరుచూరి గోపాలకృష్ణ

Paruchuri Palukulu
  • కిన్నెర మంచి ఆర్టిస్ట్ 
  • 'డాక్టర్ భవాని' షూటింగులో పరిచయం
  • అప్పుడు మాత్రం బాధపడ్డానన్న పరుచూరి
'చెట్టు కింద ప్లీడర్' సినిమాతో కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కిన్నెర, ఆ తరువాత కేరక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలు చేసింది. బుల్లితెర ధారావాహికల్లోను ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాంటి కిన్నెర గురించి 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ ప్రస్తావించారు.

"కిన్నెర అంతకుముందు సినిమాలు చేస్తున్నా, 'డాక్టర్ భవాని' సినిమా సమయంలో ఆమె మాకు పరిచయమైంది. ఎక్కడైనా ఆడపిల్లలను ఎవరైనా వేధిస్తున్నారంటే, వాళ్లని ఆదుకోవడానికి తాపత్రయపడేది. అలాగే తెరపై పద్ధతిగా కనిపించడానికే తాను ఇష్టపడేది. అలాంటి కిన్నెర పేరు ఆ మధ్య ఒక ఇష్యూలో వినిపించడం బాధేసింది. తను మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వాలి .. మంచి వేషాలు వేయాలని కోరుకుంటున్నాము. మళ్లీ ఆమె కెరియర్ పుంజుకుంటే సంతోషించేవారిలో నేనూ ఒకడిని" అని ఆయన అన్నారు.
Paruchuri Gopala Krishna
Kinnera
Paruchuri Palukulu

More Telugu News