Parmal Natwani: సీఎం జగన్​ ని కలిసిన పరిమళ్ నత్వానీ

Parimal Natwani meets CM Jagan
  • తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసులో భేటీ
  • రాజ్యసభ టికెట్ ఇచ్చిన జగన్ కు ధన్యవాదాలు చెప్పిన నత్వానీ
  • రేపు నామినేషన్ దాఖలు చేయనున్న పరిమళ్
ఏపీ నుంచి వైసీపీ తరఫున పరిమళ్ నత్వానీకి రాజ్యసభ సీటు లభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ని పరిమళ్ ఈ రోజు కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి ఈరోజు ఆయన వెళ్లారు. తనకు రాజ్యసభ సీటు ఇచ్చినందుకు జగన్ కు ధన్యవాదాలు తెలిపారు.  

రేపు నామినేషన్ దాఖలు చేయనున్న పరిమళ్ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పారు. రాష్ట్రాభివృద్ధి విషయమై మళ్లీ సీఎం జగన్ ని కలిసి చర్చిస్తానని అన్నారు. అంతకుముందు, విజయవాడ కనకదుర్గమ్మ వారిని ఆయన సందర్శించుకున్నారు. కాగా, రాజ్యసభ టికెట్లు పొందిన పరిమళ్ నత్వానీ సహా పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, అయోథ్య రామిరెడ్డి లు రేపు తమ నామినేషన్లు దాఖలు చేయనున్నారు.  
Parmal Natwani
YSRCP
Jagan
cm
Tadepally
CM Camp Office

More Telugu News