VijyayaDeverakonda: ‘కరోనా’ గురించి ప్రజలు భయపడాల్సిన పని లేదు: హీరో విజయ్​ దేవరకొండ

  • చిన్న చిన్న జాగ్రత్తల ద్వారా దీనిని నివారించవచ్చు
  • ఎవరికీ షేక్ హ్యాండ్స్ ఇవ్వొద్దు..నమస్కారం చాలు
  • కళ్లు, ముక్కు, నోటిని, చెవిని చేతితో తాకవద్దని సూచన
Hero Vijayadevera konda lists out Dos and Do nots in the outbreak of corona virus

కరోనా వైరస్ గురించి ప్రజలు భయపడాల్సిన పని లేదని, చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దీనిని నివారించవచ్చని ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ అన్నారు. ఇందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ఓ వీడియోలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, కరోనా వైరస్ ను అరికట్టాలంటే.. ఎవరికీ షేక్ హ్యాండ్స్ ఇవ్వొద్దని, ‘నమస్కారం’ చేయాలని, తరచుగా చేతిని సబ్బుతో కడుక్కోవాలని సూచించారు.

కళ్లు, ముక్కు, నోటిని, చెవిని చేతితో తాకవద్దని, ఎవరైనా దగ్గుతున్న, తుమ్ముతున్న వారి నుంచి కనీసం 3 అడుగుల దూరంలో ఉండాలని, జనసమ్మర్థం ఉన్న ప్రాంతాల నుంచి దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఎవరికైనా ‘కరోనా’కు సంబంధించిన లక్షణాలు ఉన్నట్టు గుర్తిస్తే వెంటనే ‘104’ కు ఫోన్ చేయాలని తెలంగాణ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన ఈ వీడియోలో మాట్లాడాడు.

More Telugu News