Jyothiraditya Scindia: బీజేపీలో సింధియా చేరికకు ముహూర్తం ఖరారు.. కేంద్ర మంత్రి పదవి ఆఫర్!

Jyotiraditya Scindia to join BJP at 6 PM today
  • సాయంత్రం 6 గంటలకు బీజేపీలో చేరనున్న సింధియా
  • మధ్యప్రదేశ్ లో పతనం అంచున కాంగ్రెస్ ప్రభుత్వం
  • సింధియాను రాజ్యసభకు పంపనున్న బీజేపీ
మధ్యప్రదేశ్ రాజకీయాలు ఈరోజు శరవేగంగా మలుపులు తిరిగాయి. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో జ్యోతిరాదిత్య సింధియా భేటీ కావడం, కాంగ్రెస్ పార్టీకి ఆయన రాజీనామా చేయడం కాంగ్రెస్ నుంచి ఆయనను బహిష్కరించడం వెనువెంటనే జరిగిపోయాయి. దీనికి తోడు సింధియా అనుచరులైన 19 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు.

దీంతో, మధ్యప్రదేశ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం పతనం అంచుకు చేరుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ కంటే బీజేపీ బలం ఎక్కువ కావడంతో... ఆ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమమైంది. మరోవైపు సింధియాను రాజ్యసభకు పంపి, కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలనే యోచనలో బీజేపీ అధిష్ఠానం ఉంది.

ఈ పరిణామాల నేపథ్యంలో, ఈరోజే బీజేపీ తీర్థాన్ని సింధియా పుచ్చుకోనున్నారు. సాయంత్రం 6 గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. మరోవైపు, మధ్యప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే... శివరాజ్ సింగ్ చౌహాన్ మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టనున్నారు.
Jyothiraditya Scindia
BJP
Congress
Rajya Sabha
Madhya Pradesh

More Telugu News