Maruti Rao: అమృత, ప్రణయ్‌ల సంచలన ప్రేమ కథ ఆధారంగా సినిమా.. టైటిల్‌ ఖరారు

  • కొత్త దర్శకుడు శివనాగేశ్వర్ రావు దర్శకత్వం
  • బాలాదిత్య, అర్చన జంటగా సినిమా
  • ‘అన్నపూర్ణమ్మ గారి మనవడు’ పేరుతో సినిమా  
movie on pranay amrutha love story

ఆత్మహత్య చేసుకున్న మారుతీరావు కూతురు, అల్లుడు  అమృత, ప్రణయ్‌ల ప్రేమ కథ ఆధారంగా శివనాగేశ్వర్ రావు అనే కొత్త దర్శకుడు సినిమా తీస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పనుల్లో ఆయన బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో నటించిన వారి పేర్లు బయటకు వచ్చాయి.

ఇందులో  సీనియర్ నటి అన్నపూర్ణమ్మ, మాస్టర్ రవితేజతో పాటు బాలాదిత్య, అర్చన నటించనున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుందని బాలాదిత్య మీడియాకు తెలిపాడు. నిజజీవిత కథతో పాటు కొంత కల్పిత కథను కూడా చేర్చి ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. బాలాదిత్య సరసన అర్చన నటిస్తోంది. ఈ సినిమాకి ఎంఎన్‌ఆర్‌ చౌదరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు ‘అన్నపూర్ణమ్మ గారి మనవడు’ అనే పేరును ఖరారు చేశారు.

More Telugu News