YSRCP: ప్రభుత్వ భవనాలకు రంగుల కేసులో.. వైసీపీ సర్కారుకు షాక్ ఇచ్చిన హైకోర్టు

AP High Court orders to remove YSRCP colours on government buildings
  • ప్రభుత్వ కార్యాలయాలపై వైసీపీ రంగులపై తీర్పు
  • రాజకీయ రంగులను వెంటనే తొలగించాలని ఆదేశం
  • 10 రోజుల్లోగా కొత్త రంగులు వేయాలంటూ ఉత్తర్వులు
వైసీపీ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షాక్ ఇచ్చింది. ప్రభుత్వ కార్యాలయాలపై వైసీపీ రంగులకు సంబంధించి కీలక తీర్పును వెలువరించింది. పంచాయతీ భవనాలకు, ఇతర ప్రభుత్వ భవనాలకు వేసిన రాజకీయ రంగులను తొలగించాలని ఆదేశించింది. పది రోజుల్లోగా కొత్త రంగులు వేయాలని ఆదేశాలు జారీ చేసింది.

తాము ఇచ్చిన ఆదేశాలను అమలు చేసినట్టు పూర్తి ఆధారాలను నివేదిక రూపంలో ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. గుంటూరు జిల్లాకు చెందిన ముప్పా వెంకటేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఈమేరకు తీర్పును వెలువరించింది.
YSRCP
Government Buildings
Party Colours
Andhra Pradesh
AP High Court

More Telugu News