Rakul Preet Singh: అందం కోసమో, నాజూకుగా ఉండేందుకో నేను ఇవన్నీ చేయడం లేదు: రకుల్ ప్రీత్ సింగ్

Health is important than beauty says Rakul Preet Singh
  • అందం కోసం వ్యాయామం చేయడం లేదు
  • మనిషికి అందం కంటే ఆరోగ్యం ముఖ్యం
  • రోజూ అరగంట శ్రమిస్తే ఆరోగ్యంగా ఉంటాం
సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ అంటే కేవలం అందమే కాదు.. ఫిట్ నెస్ కూడా గుర్తుకొస్తుంది. ఫిట్ నెస్ కోసం జిమ్ లో రకుల్ ఎంతగా శ్రమిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాను వర్కౌట్లు చేస్తున్న వీడియోలను ఆమె క్రమం తప్పకుండా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. అంతేకాదు, ఫిట్ నెట్ ప్రాధాన్యతను అందరికీ వివరిస్తుంటుంది. అందరూ ఫిట్ గా ఉండాలని సూచిస్తుంటుంది.

ఈ నేపథ్యంలో, రకుల్ కు ఓ ప్రశ్న ఎదురైంది. అందాన్ని కాపాడుకోవడానికే ఫిట్ నెస్ పై దృష్టి పెట్టారా? అనేదే ఆ ప్రశ్న. దీనికి రకుల్ ఆసక్తికర సమాధానాన్ని ఇచ్చింది. అందరూ అనుకుంటున్నట్టు అందం కోసమో, నాజూకుగా ఉండేందుకో తాను వ్యాయామం చేయడం లేదని చెప్పింది. మనిషికి అందం కంటే ఆరోగ్యం ముఖ్యమని తెలిపింది. చిన్నప్పటి నుంచి తాను ఆటల్లో ముందుండేదాన్నని... సినిమాల్లోకి వచ్చాక కూడా అదే కొనసాగుతోందని చెప్పింది. షూటింగుల కోసం అనేక ప్రాంతాలు తిరుగుతుంటామని... అక్కడి వాతావరణ పరిస్థితులను తట్టుకోవాలంటే శరీరం ఫిట్ గా ఉండాలని తెలిపింది. రోజూ ఒక అరగంట శ్రమిస్తే ఎలాంటి నష్టం లేదని.. చాలా ఆరోగ్యంగా ఉంటామని చెప్పింది.
Rakul Preet Singh
Work outs
Fitness
Tollywood
Bollywood

More Telugu News