Prabhas: అంతర్జాతీయ ఫైటర్లతో ఛేజ్ సీన్ పూర్తయింది: ప్రభాస్

Prabhas New Movie Schedule completed
  • యూపీ క్రియేషన్స్ బ్యానర్ పై కొత్త చిత్రం
  • హీరోయిన్ గా పూజా హెగ్డే
  • ఓ షెడ్యూల్ పూర్తయిందన్న ప్రభాస్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ప్రస్తుతం యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్ డేట్ ను తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రభాస్ ఫ్యాన్స్ తో పంచుకున్నాడు. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, ఈ సినిమాకు 'జాన్' అన్న టైటిల్ ప్రచారంలో ఉంది.

ఇక "అంతర్జాతీయ ఫైటర్ క్రూతో ఇప్పుడే ఓ క్యూట్ ఛేజ్ సీన్ షూటింగ్ పూర్తయింది. యూరప్ లో ఇక దీర్ఘ షెడ్యూల్ కు వెళ్లాల్సి వుంది. మరిన్ని అప్ డేట్స్ త్వరలోనే తెలియజేస్తాను" అని ప్రభాస్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించాడు.
Prabhas
New Movie
Schedule
Twitter

More Telugu News