India: 8 నెలల కనిష్ఠానికి పెట్రోలు ధర!

  • పెట్రోల్‌ పై 24 నుంచి 27 పైసలు తగ్గుదల
  • డీజిల్‌ పై 25 నుంచి 26 పైసల కోత
  • హైదరాబాద్ లో రూ. 75కు పెట్రోలు ధర
Petrol Price Slash In India

సౌదీ అరేబియా, రష్యాల మధ్య నెలకొన్న చమురు యుద్ధం కారణంగా క్రూడాయిల్ ధరలు భారీగా పడిపోగా, ఇండియాలో సైతం పెట్రోలు, డీజిల్ వినియోగదారులకు స్వల్ప ఊరట లభించింది. వివిధ నగరాల్లో పెట్రోల్‌ పై 24 నుంచి 27 పైసలు, డీజిల్‌ పై 25 నుంచి 26 పైసల మేర ధర తగ్గిస్తున్నట్టు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు తెలిపాయి. దీంతో ఎనిమిది నెలల కనిష్ఠానికి పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గాయి.

ఇక ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ రూ. 70.59కి చేరుకోగా, డీజిల్‌ ధర లీటర్‌ రూ. 63.26కి దిగివచ్చింది. హైదరాబాద్‌ లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 75.04గా, డీజిల్‌ లీటర్‌ ధర రూ. 68.88 వద్ద కొనసాగుతోంది. ఈ ధరలు సమీప భవిష్యత్తులో మరింతగా తగ్గుతాయని చమురు రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.

More Telugu News