Gandhi Hospital: తెలంగాణలో కోలుకున్న తొలి కరోనా బాధితుడు.. ఆరోగ్యంగా ఉన్నాడన్న వైద్యులు!

Corono Virus Affected Man Recovering in Telangana
  • తగ్గిన జ్వరం.. అదుపులో బీపీ
  • నిర్ధారణ కోసం పూణెకు నమూనాలు
  • ‘గాంధీ’లో చేరిన మరో 8 మంది
గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాష్ట్రంలోని తొలి కరోనా బాధితుడు కోలుకున్నట్టు తెలుస్తోంది. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో నెగటివ్ రిపోర్టులు రావడంతో వైద్యులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం అతడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని, జ్వరం తగ్గిందని, బీపీ నియంత్రణలోకి వచ్చిందని వైద్యులు తెలిపారు. అయితే, మరోమారు అతడి నమూనాలను పూణె పంపి నిర్ధారించుకోవాలని భావిస్తున్నారు. కాగా, తాజాగా కరోనా అనుమానాలతో చేరిన 8 మందితో కలిపి గాంధీలో చికిత్స పొందుతున్న ఆ బాపతు బాధితుల సంఖ్య 40కి చేరుకుంది.
Gandhi Hospital
Corona Virus
Telangana

More Telugu News