Nirbhaya: శిక్ష తగ్గించాలంటూ ఢిల్లీ గవర్నర్ కు నిర్భయ దోషి పిటిషన్

Nirbhaya convict Vinay Sharma files petition to Delhi LG
  • పిటిషన్లతో ఉరి అమలు ఆలస్యం చేస్తున్న నిర్భయ దోషులు
  • ఈ నెల 20న ఉరితీయాలంటూ తాజా వారెంట్ జారీచేసిన ఢిల్లీ కోర్టు
  • జైల్లో తాను చాలా పరివర్తన చెందానన్న వినయ్ శర్మ
  • తన కుటుంబ పరిస్థితి కూడా చూడాలని గవర్నర్ కు విజ్ఞప్తి
నిర్భయ కేసులో దోషులను ఈ నెల 20న ఉరి తీయాలంటూ ఢిల్లీ కోర్టు తాజా వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ నిర్భయ దోషులు ఉరి నుంచి తప్పించుకునే ప్రయత్నాలు ఆపడంలేదు. ఇప్పటికే అనేక పర్యాయాలు పిటిషన్ల పేరుతో మరణశిక్ష అమలును ఆలస్యం చేసిన దోషులు తాజాగా మరో ప్రయత్నం చేశారు. దోషి వినయ్ శర్మ తన శిక్ష తగ్గించాలంటూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ను అభ్యర్థించాడు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశాడు. ఈ కేసులో తాను అనుభవించిన జైలు శిక్ష తనలో ఎంతో పరివర్తన తీసుకువచ్చిందని, తన కుటుంబ పరిస్థితిని కూడా చూడాలని గవర్నర్ ను కోరాడు.​
Nirbhaya
Vinay Sharma
Delhi
LG
Petition

More Telugu News