Maruti Rao: మా నాన్న ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు: అమృత

My father is not cowardly to commit suicide says Amrita
  • మారుతీ రావు ఆత్మహత్యపై కూతురు అనుమానాలు
  • ఆయనకు బినామీ ఆస్తులున్నాయి
  • బాబాయ్‌ శ్రవణ్‌తో గొడవలు ఉన్నాయి
  • తన తల్లికి కూడా ప్రాణాపాయం ఉండొచ్చని వ్యాఖ్య
తన తండ్రి మారుతీ రావు ఆత్మహత్యపై అమృత అనుమానం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని అన్నారు. తన భర్త ప్రణయ్ హ్యత కేసులో శిక్ష పడుతుందన్న భయంతోనే మారుతీరావు బలన్మరణానికి పాల్పడ్డాడని తేల్చడం సరికాదన్నారు.

అలాగే, తన తల్లికి కూడా ప్రాణాపాయం ఉండొచ్చని వ్యాఖ్యానించారు. మారుతీరావుకు బినామీ పేర్లతో చాలా ఆస్తులు ఉన్నాయని అమృత చెప్పారు. ఆస్తుల విషయంలో బాబాయ్ శ్రవణ్‌కు, తన తండ్రికి మధ్య గొడవలు ఉన్నాయని తెలిపారు. తన తండ్రిని శ్రవణ్ కొన్నిసార్లు కొట్టినట్టు కూడా తనకు తెలిసిందని చెప్పారు. ఈ నేపథ్యంలో తన తల్లికి కూడా ప్రాణాపాయం ఉండొచ్చని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ఇక, తన బాబాయ్ రెచ్చగొట్టడం వల్లే ప్రణయ్‌ను మారుతీరావు హత్య చేయించారని అమృత వెల్లడించారు. అయితే, తన తండ్రి ఆస్తులపై తనకు ఎలాంటి ఆసక్తి లేదని స్పష్టం చేశారు.
Maruti Rao
suicide
Amrita

More Telugu News