Womens T20 World Cup: ప్రపంచకప్‌ నెగ్గిన ఆసీస్ అమ్మాయిలు ఎలా ఎంజాయ్‌ చేశారో చూడండి

Australia Players Celebrate Womens T20 World Cup Win By Dancing
  • అమెరికా పాప్‌ స్టార్‌‌ కేటీ పెర్రీతో కలిసి డ్యాన్స్‌ చేసిన క్రికెటర్లు
  • ఆదివారం రాత్రి జరిగిన విక్టరీ సెలబ్రేషన్స్
  • ఫైనల్లో భారత్‌ను ఓడించి ఐదో కప్పుతో రికార్డు సృష్టించిన ఆసీస్
మహిళల టీ20 ప్రపంచకప్‌లో రికార్డు స్థాయిలో ఐదోసారి విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా అమ్మాయిలు ఈ విజయాన్ని తెగ ఆస్వాదించారు. ఫైనల్ ముగిసిన అనంతరం అమెరికా పాప్‌ స్టార్‌‌ కేటీ పెర్రీతో కలిసి సెలబ్రేట్‌ చేసుకున్నారు. క్రికెట్‌ ఆస్ట్రేలియా ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆసీస్‌ క్రికెటర్లంతా పాల్గొన్నారు.

అందరూ టీమ్‌ జెర్సీలు ధరించి.. కేటీ పెర్రీతో కలిసి ఉత్సాహంగా కనిపించారు. కొంతమంది క్రికెటర్లు హుషారుగా డ్యాన్స్‌ చేశారు. ఫైనల్‌కు ముందు ఎంసీజీ స్టేడియంలో జరిగిన ఆరంభోత్సవంలో లైవ్ పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్న కేటీ పెర్రీ.. స్టేజ్‌పై ఆసీస్‌ అమ్మాయిలను ఉత్సాహపరుస్తూ కనిపించింది. ముఖ్యంగా ఆసీస్ స్పిన్నర్‌‌ సోఫీ మొలినెయుక్స్‌ తన స్టేప్పులతో అందరినీ అలరించింది. ఈ వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. విశ్వవిజేతలుగా నిలిచిన ఆసీస్ అమ్మాయిలు తమ విజయాన్ని ఎలా సెలబ్రేట్‌ చేసుకున్నారో మీరూ చూడండి.
Womens T20 World Cup
Australia
Celebrate

More Telugu News