Kurmaiah: దిశ నిందితుడు చెన్నకేశవులు తండ్రి మృతి

  • గతంలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన చెన్నకేశవులు తండ్రి కూర్మయ్య
  • హైదరాబాదులో చికిత్స అందించిన వైనం
  • ఇటీవలే స్వగ్రామంకు తీసుకువచ్చిన కుటుంబ సభ్యులు
గతంలో ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడిన దిశ నిందితుడు చెన్నకేశవులు తండ్రి కూర్మయ్య మృతి చెందాడు. బైక్ పై వెళుతున్న కూర్మయ్యను ఓ ఇన్నోవా వాహనం ఢీకొట్టింది. గాయాలపాలైన అతడిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. ఇటీవలే కూర్మయ్యను కుటుంబ సభ్యులు స్వగ్రామం గుడిగండ్లకు తీసుకువచ్చారు. కొన్నిరోజుల కిందటే చెన్నకేశవులు భార్య రేణుక అమ్మాయికి జన్మనివ్వగా, ఇంతలోనే కూర్మయ్య మరణించడం వారి కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసింది.
Kurmaiah
Chennakeshavulu
Disha
Hyderabad

More Telugu News