టీడీపీకి డొక్కా మాణిక్యవరప్రసాద్​ రాజీనామా

09-03-2020 Mon 15:14
  • టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికొ డొక్కా రాజీనామా
  • చంద్రబాబునాయుడుకి లేఖ రాసిన డొక్కా
  • త్వరలో వైసీపీలో చేరతారని సమాచారం
Dokka Manikya Varaprasad resigns to TDP
టీడీపీ ఎమ్మెల్యే పదవికి ఇటీవలే తాను ఎందుకు రాజీనామా చేశానన్న విషయాన్ని వివరిస్తూ తన మిత్రులు, శ్రేయోభిలాషులను ఉద్దేశిస్తూ మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ బహిరంగ లేఖ రాసిన విషయం తెలిసిందే. తాజాగా, టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికీ ఆయన రాజీనామా చేశారు. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకి ఓ లేఖ రాశారు. కాగా, డొక్కా త్వరలో వైసీపీలో చేరే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.